Saturday, November 23, 2024

ఐపీఎల్‌కు సఫారీలు దూరం, ఫ్రాంచైజీలకు గట్టి షాక్‌.. బంగ్లాతో వన్డే సిరీసే కారణం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు గట్టిషాక్‌ తగలనుంది. ప్రారంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూరం కానున్నారు. సఫారీల జట్టు మార్చి 18 నుంచి 23వరకు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది. ఐపీఎల్‌ ఆడుతున్న 8 మంది ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది. దీంతో బంగ్లాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా.. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలున్నాయి. కసిగో రబడ, లుంగి ఎన్‌గిడి, రాస్సీ వాన్‌ డెర్‌ డ్యూసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్వింటన్‌ డికాక్‌, ఐడెన్‌ మార్క్‌ రామ్‌, డ్వైన్‌ ప్రిటోరియస్‌, మార్కో జాన్సెన్‌లు బంగ్లాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎల్‌ 26 నుంచి ప్రారంభం అవుతున్నది. సఫారీలకు 2 రోజుల సమయమే ఉంటుంది.

భారత్‌లో అడుగుపెట్టాక.. కరోనా నిబంధనల ప్రకారం.. క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో వారు ఆరంభ మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలున్నాయి. దీనికితోడు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 12 మధ్య రెండు టెస్టులు కూడా ఆడనుంది. దీనికి జట్టును ప్రకటించలేదు. దీంతో ఐపీఎల్‌ ఆడనున్న ఆటగాళ్లు మళ్లిd టెస్టు సిరీస్‌కు ఎంపికైతే.. లీగ్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం అవుతారు. దీంతో ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. ఐపీఎల్‌ ఆడాలా.. దేశానికి ఆడాలా నిర్ణయం సఫారీ క్రికెట్‌ బోర్డు ఆటగాళ్లపైనే వదిలేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement