ఐపీఎల్ ప్రారంభానికే ముందే.. చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ తగిలింది. మెగా వేలంలో ఆ జట్టు కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న దీపక్ చాహర్.. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచులో గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో ఆ మ్యాచ్‌లో చాహర్ 1.5 ఓవర్లు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. వేసిన 11 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. గాయంతో శ్రీలంక సిరీస్‌కు, ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకే దూరం అవుతాడని భావించిన అధికారులు.. ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సీఎస్‌కేను వెంటాడుతున్నాయి. గాయం తీవ్రం కావడంతో మరోదారి కనిపించడం లేదని సమాచారం. దీపక్ చాహర్‌ను సీఎస్‌కే జట్టు రూ.14కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..