Tuesday, November 26, 2024

మేఘాలయలో కాంగ్రెస్ కు మళ్లీ షాక్

ప్ర‌భ‌న్యూస్ : మేఘాలయంలో కాంగ్రెస్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. రాష్ర్టంలో నిన్నమొన్నటి వరకు కాస్త బలంగా ఉన్నప్పటికీ ఇటీవల 12మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంతో డీలా పడింది. మొత్తం 17మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కు పాలుపోవడం లేదు. మేఘాలక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేమ్స్ లింగ్డో, మాజీ జనరల్ సెక్రటరీ డా.మానస్ దాస్ గుప్తా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు షిల్లాంగ్ లో ప్రకటించారు.

33 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, తన తండ్రి కాంగ్రెస్ కు మేఘాలయను పెట్టని కోటలా తీర్చిదిద్దారని, కానీ నన్ను పార్టీనుంచి బహిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందువల్ల తానే రాజీనామా చేస్తున్నానని రాజీనా లేఖలో పేర్కొన్నారు. 2017 శాసనసభ ఎన్నికల నుంచి కాంగ్రెస్ కు పతనం ప్రారంభమయ్యిందని చెప్పారు. మరోవైపు మేఘాలయ కాంగ్రెస్ పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్లుగా డెబ్రో సి మారక్, పి.ఎన్. సయీమ్ లను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అలాగే జనరల్ సెక్రటరీలుగా బిల్లికిడ్ సంగ్మా, జి.అరెంగ్, రోజర్ బెన్నీ, ఎ.సంగ్మ, ఇ.ఆస్కార్ ఫిరా, మాన్యేల్ బద్వార్ లను నియమించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement