హిమాచల్ సీఎం పదవికి సుఖ్మీందర్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్‌కు సుఖ్వీందర్ సింగ్ పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
ఇక, సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకునే చాన్స్ ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం హిమాచల్ ప్రదేశ్ పాలిటిక్స్ ను షేక్ చేసింది. కాంగ్రెస్ కు బిజెపి కంటే ఆరుగురు సభ్యుల బలం ఉన్నప్పటికీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయింది.. కాంగ్రెస్ పై ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి బిజెపికి అభ్యర్ధికి ఓటు వేశారు.. దీంతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు.