Tuesday, November 19, 2024

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ ఇక లేరు.. క‌రోనాతో చికిత్స పొందుతూనే..

హైదరాబాద్ : ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) ఇక లేరు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డింది. కాగా, ఆయ‌న పెద్ద కుమారుడు ఇంకా కోలుకోలేదని డాక్ట‌ర్లు చెప్పారు.

చెనైలో 1948 డిసెంబర్ 7 జ‌న్మించారు శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌. ఆయ‌న తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి. 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన మాస్టర్.. భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. అంతేకాకుండా దాదాపు 30 చిత్రాల్లో నటించారు. కాగా, 2011లో మగధీర చిత్రానికి గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు ఆయ‌న‌. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలు.. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి.

మాస్టర్​ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన కుటుంబానికి ప్రముఖ నటీ నటులు సంతాపం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement