వెండితెరపై తండ్రి కూతురు కలిసి నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన సంఘటన శేఖర్ సినిమా ద్వారా వీక్షించబోతున్నాం. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘శేఖర్’ సినిమాలో ఆయన పెద్ద కుమార్తె నటి శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారట. సినిమాలోనూ రాజశేఖర్ శివాని తండ్రి కూతురుగా నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిదె అని చిత్ర బృందం అంటోంది.
ఇది కూడా చదవండి : నిధి అగర్వాల్ (హీరోయిన్)
‘శేఖర్’ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. దర్శకురాలు జీవిత మాట్లాడుతూ ”రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తాయి. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంట పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామం అని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital