Tuesday, November 26, 2024

కార్మికులారా..ఎవరినీ నమ్మకండి: శివాజీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజా నటుడు శివాజీ కూడా ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకించాడు. కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు శివాజీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోందని శివాజీ విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఎలుగెత్తాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకొస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ఈ పోరాటంలో ఎవరినీ నమ్మవద్దని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సూచించారు. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని స్పష్టం చేశారు. మా ప్రాంతం కోసం మీరేం చేస్తున్నారంటూ నేతలను ఢిల్లీకి పరుగులు తీయించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement