Friday, November 22, 2024

అత్యంత ఎత్తైన ప్ర‌దేశంలో శివాల‌యం.. ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్ చేసిన నార్వే దౌత్య‌వేత్త‌

ఇది హిమాలయాల్లో నెలవైన శివాలయం. దీనిపేరు తుంగ్‌నాథ్‌ మందిర్‌. ఉత్తరాఖండ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలోని శివాలయంగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో ఉంది. బహుశా 1000 ఏళ్ల కిందట నిర్మించినట్లు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నార్వే దౌత్యవేత్త ఎరిక్‌ సోల్హిమ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ఆలయం 5000 ఏళ్ల నాటిదని చెప్పుకొచ్చారు. అద్భుత దృశ్యం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆలయ ప్రాచీనత విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement