ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ముఖ్యమంత్రి పదవిని, ప్రభుత్వాన్ని పోగొట్టుకున్న శివసేన అధ్యక్షుడు ఉద్థవ్‌థాక్రే, ఎంపీలను నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సైతం బెడిసి కొడుతున్నాయి. శివసేనకు లోక్‌సభలో మొత్తం 19 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 12 మంది ఎంపీలు మంగళవారం పార్టీ చీఫ్‌విప్ మార్పు కోరుతూ, స్పీకర్‌కు లేఖ రాశారు.
లోక్‌సభలో శిపసేన పార్టీ చీఫ్‌విప్ భావన గవాలి స్థానంలో రాహుల్ షెవాలేను నియమించాలని కోరుతూ 12 మంది ఎంపీలు స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసినట్లు స్పీకర్ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. అయితే, చీఫ్‌విప్ భావన గవాలి స్థానంలో రచనవిచారేను నియమించాలని కోరుతూ, ఉద్థవ్‌థాక్రే వర్గం వినాయక్ రౌత్ స్పీకర్ ను కోరారు. విచారే పార్టీ కొత్త చీఫ్‌విప్ అని ప్రకటించారు. దీంతో, రెండు వర్గాల మధ్య పోరు స్పీకర్ కార్యాలయానికి చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.