రాష్ట్రపతి ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ఇస్తున్నామని బీజేపీ మాజీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) శుక్రవారం తెలిపింది. ముర్ముకు మద్దతు కోరేందుకు పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను బీజేపీ చీఫ్ నడ్డా సంప్రదించినట్టు తెలిపారు. కాగా, ద్రౌపది ముర్ముని సీనియర్ పార్టీ సభ్యులు బల్వీందర్ సింగ్ భుందూర్, ప్రేమ్ సింగ్ చందుమజ్రా, చరణ్‌జిత్ సింగ్ అత్వాల్‌లతో కలిసి శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ కలుసుకున్నారు.
ఇక.. మీడియాను ఉద్దేశించి బాదల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. వ్యవసాయ చట్టాలు, సిక్కు ఖైదీల విడుదల సమస్యల వంటివి తమకూ, బిజెపితో చాలా విభేదాలున్నాయి.. అయినా సమాజంలోని పేద, బలహీన వర్గాల కోసం తమ పార్టీ పని చేస్తుందని అన్నారు.
మూడు వ్యవసాయ చట్టాల సమస్యపై శిరోమణి అకాలిదళ్ పార్టీ2020లో ఎన్డీఏతో విడిపోయింది. ఈ క్రమంలో హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఇదే అంశంపై కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రెసిడెంట్ బాదల్ ఫిరోజ్‌పూర్ నుండి ఎంపీ కాగా, ఆయన భార్య హర్‌సిమ్రత్ బటిండా పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక.. రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు.