త్వరలోనే 45 వేల టన్నుల సామర్ధం కలిగిన అతి పెద్ద నౌకలను హిందూస్టాన్ షిప్ యార్డు తాయారుచేయనుందని ఆ సంస్థ సీఎండీ హేమంత్ కతిరి ప్రకటించారు. హిందూస్థాన్ షిప్ యార్డు కాలనీలో ఆరు రోజులపాటు నిర్వహిస్తున్న షిప్ యార్డ్ మేళాను ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూషిప్ యార్డ్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్ పేరిట ఈ మేళాను ఏర్పాటు చేసస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుండి 16 వరకు విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులో సందర్శనార్థం మేళా నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో 75 ప్రదేశాల్లో షిప్ యార్డ్ మేళాలను రక్షణ శాఖ మంత్రి ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు.
ఇప్పటివరకు షిప్ యార్డులో 200 వరకు నౌకల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 1972 లో మొట్ట మొదటిసారిగా సింధూవీర్ అనే నౌకను నాలుగు నెలల వ్యవధిలో రిపేర్ చేసి ఇవ్వడమైందన్నారు. షిప్ యార్డ్ నెలకొల్పిన నాటి నుండి నేటి వరకు దాదాపు 2000 వరకు నౌకలను రిపేర్ చేయడమైందన్నారు. షిప్ నిర్మాణ పనుల్లో యార్డులో 2600 మంది వరకు ప్రతినిత్యం ఉపాధి అవకాశాలు పొందదుతున్నట్లు వెళ్లడించారు. మరో సంవత్సర కాలంలో 4000 మంది వరకు గుత్తేదారు కార్మికులకు ఉపాధి కల్పన దిశగా హిందూస్థాన్ షిప్ యార్డు అడుగులు వేస్తోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital