Tuesday, November 26, 2024

అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి… రాజ్ కుంద్రాల‌కి సుప్రీంకోర్టులో ఊర‌ట‌

బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి..రాజ్ కుంద్రాల‌కి సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. అశ్లీల చిత్రాల‌కు సంబంధించిన కేసులో వీరికి ముందస్తు బెయిల్ ని మంజూరు చేసింది. వీరితో పాటు మరో నలుగురు నిందితులకు కూడా ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఛార్జిషీట్‌ లో దాఖలైన అంశాలపై కుంద్రా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ స్పందిస్తూ.. మీడియా నివేదికల ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఈ నేరంతో తన క్లయింట్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు.

ముంబయి సైబర్ క్రైమ్ కోర్టు ముందు ఈ విషయంపై ఛార్జిషీట్ దాఖలైందని తమకు మీడియా ద్వారానే తెలిసింది. న్యాయపరమైన ప్రక్రియను అనుసరించి, చార్జిషీట్ కాపీని సేకరించేందుకు కోర్టు ముందు హాజరవుతాం అని పాటిల్ చెప్పారు.అశ్లీల కంటెంట్‌ను పంపిణీ చేశారనే ఆరోపణలపై ముంబై పోలీసులు 2020లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు రాజ్ కుంద్రా చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు నవంబర్ 25న తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత నెలలో మహారాష్ట్ర సైబర్ పోలీసులు రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్‌ను తయారు చేశారని ఆరోపిస్తూ ఛార్జిషీట్ దాఖలు చేశారు, దానిని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పంపిణీ చేశాయని తెలిపారు. షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, సినీ నిర్మాత మీటా జున్‌జున్‌వాలా, కెమెరామెన్ రాజు దూబేతో కలిసి ఫైవ్‌స్టార్ హోటళ్లలో కుంద్రా అశ్లీల చిత్రాలు లేదా అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్లు చార్జిషీట్‌ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement