భారత క్రికెట్ జట్టు ఓపెనర్‌గా పలు సంచలన ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ధావన్ వెంచర్ క్యాపిటలిస్టుగా మారారు. వెంచర్ క్యాపిటలిస్టుగా మారిన ఆసియాలోనే మొదటి స్పోర్ట్స్ పర్సన్ శిఖర్ ధావన్. స్పోర్ట్స్ ఇన్నోవేషన్‌కు ఈ వెంచర్ క్యాపిటల్ నుంచి ఫండింగ్ ఇవ్వనున్నారు. 75 మిలియన్ డాలర్ల గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో 25 మిలియన్ డాలర్ల గ్రీన్ షూ ఆఫ్షన్ ఉంది. శనివారం నాడు అబూదాబీలో జరుగుతున్న గ్లోబల్ మార్కెట్ ఫైనాన్స్ వీక్‌లో శిఖర్ ధావన్, తన సహచరులతో కలిసి దీన్ని ప్రకటించారు.
తాను రెండో ఇన్నింగ్స్‌లో వెంచర్ క్యాపిటల్ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాని చెప్పారు. 2023-24 ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది మార్కెట్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చెప్పారు. తన వ్యాపార భాగస్వాములు లేకుండా ఇది సాధ్యపడేదికాదని ధావన్ చెప్పారు. పూర్తి అంకిత భావంతో దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు.