Thursday, November 14, 2024

గొర్రెల కాప‌రిగా మారిన ‘ఎంపీటీసీ’..ఎందుకో తెలుసా..

ఓ వ్య‌క్తి గొర్రెలు కాస్తోన్న వార్త వైర‌ల్ అవుతోంది. గొర్రెలు కాస్తే వింతేమిటి అనుకుంటున్నారా..ఆయ‌న ఓ ఎంపీటీసీ స‌భ్యుడు కావ‌డ‌మే. అదికూడా తెలంగాణ‌లోని అధికార పార్టీ టిఆర్ ఎస్ కి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌పై చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఆ క‌థేంటో చూద్దాం.. వనపర్తి జిల్లా పాన్ గ‌ల్ మండలం శాఖాపూర్ కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు సుబ్బయ్య యాదవ్ గొర్రెల కాపరిగా మారాడు. తాను ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడంతో గొర్రెల కాపరిగా మారాన‌ని చె్ప్ప‌డం విశేషం. గ్రామానికి చెందిన రాములు, కొమ్ము బిచ్చ‌న్న‌ వద్ద గొర్రెల కాపరిగా పని చేస్తున్నాన‌ని చెప్పారు. రోజుకు రూ. 500 కూలీ ఇస్తున్నారని తెలిపారు.

కాగా తాను రెండు రోజులుగా తాను గొర్రెల‌ను కాస్తున్నాన‌ని చెప్పారు. అంతే కాకుండా ప్రభుత్వం ఎంపిటిసిలకు ప్రత్యేక నిధులను కేటాయించాలని సుబ్బయ్య యాదవ్ కోరారు. ఇది ఇలా ఉంటే సుబ్బయ్య యాదవ్ గొర్రెలు కాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రామంలో నిధులు రాకపోవడం వల్లనో ఇతర కారణాల వల్లనో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు అర్థం అవుతోంది. మ‌రి ఈ విష‌యం ఆ నోట ఈ నోటా చేరి సీఎం కేసీఆర్ వ‌ర‌కు వెళ్తుందేమో చూడాలి. ఇప్ప‌టికైనా ఎంపిటిసిల నిధుల‌ను కేటాయిస్తారేమో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement