ఇంతకు ముందు అధ్యక్షుడిగా పని చేసిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం చనిపోయారు. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ప్రకటించింది. వామ్ ప్రకటన ప్రకారం, అబుదాబిలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్‌లో ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సమావేశమై యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొత్త అధ్యక్షుడు మళ్లీ ఎన్నికకు అర్హత సాధించడానికి ముందు ఐదేళ్ల పదవీకాలం కోసం పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించగా.. యూఏఈ పాలకులు హాజరయ్యారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ జనవరి 2005 నుంచి యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్‌గా కూడా పనిచేశారు. వ్యూహాత్మక ప్రణాళిక, శిక్షణ, సంస్థాగత నిర్మాణం, రక్షణ సామర్థ్యాలను ప్రోత్సహించడంలో యూఏఈ సాయుధ దళాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..