Tuesday, November 26, 2024

IND vs SA | షఫాలీ న‌యా రికార్డు.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

టీమిండియా మహిళా ఓపెనర్ షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో శుక్రవారం మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ సాధించింది. దీంతో మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కింది.

వన్డే తరహా బ్యాటింగ్‌తో 194 బంతుల్లో (23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205 పరుగులు) డబుల్ సెంచరీ నమోదు చేసిన షఫాలీ వర్మ.. ఆస్ట్రేలియా బ్యాటర్‌‌ అన్నాబెల్లె సదర్లాండ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డును అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాపై అన్నాబెల్లె సదర్లాండ్ 248 బంతుల్లో డబుల్ సెంచరీ చేసింది.

ఇప్పటివరకు ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీగా మిగిలిపోగా.. షెఫాలీ వర్మ ఆ రికార్డును తిరగరాసింది. ఆమెను సౌతాఫ్రికా బౌలర్లు ఔట్ చేయలేకపోయారు… కానీ జెమీమా రోడ్రిగ్స్‌తో సమన్వయ లోపం కారణంగా షెఫాలీ వర్మ రనౌట్‌గా వెనుదిరిగింది. దాంతో 205 పరుగుల భారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

- Advertisement -

రెండో భారత మహిళగా మరో రికార్డ్…

భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాట్స్‌మెన్‌గా కూడా షఫాల్మీ వర్మ రికార్డు నమోదు చేసింది. 22 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 407 బంతుల్లో 214 పరుగులతో డబుల్ సెంచరీ సాధించింది. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత 20 ఏళ్ల షెఫాలీ వర్మ భారత్ తరఫున మరో డబుల్ సెంచరీ నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement