ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి గెలవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌తో పాటు కోహ్లీ అభిమానులు పండుగ చేసుకున్నారు. పురుషుల జట్టు ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. కానీ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ డబ్ల్యూపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పురుషుల జట్టు కూడా మురిసిపోతోంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి అభినందనలు తెలిపాడు.
ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కూడా కోహ్లీ స్పందించాడు. ట్రోఫీని సాధించిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టు ‘సూపర్ వుమెన్స్’ అని ప్రశంసించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తొలి టైటిల్ గెలవడం పట్ల ఆ జట్టు అభిమానులు ఫుల్ కుషీలో ఉన్నారు. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫ్రాంఛైజీకి కప్పు రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు సైతం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కాగా టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ మెన్స్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్ ఉమెన్ అని పోస్టు చేశాడు.
అంతేకాకుండా మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో వీడియో కాల్ సైతం మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు సంభాషించాడు. అనంతరం ఇతర ప్లేయర్లతో సైతం మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.