Saturday, November 23, 2024

ఇంట్లో ప్రియుడితో ఆమె.. స‌డెన్ గా భర్త రావడంతో..

ఇల్లీగ‌ల్ ఎఫైర్స్ ప్రాణాలు తీస్తున్నా కొంత మంది బుద్ధి మారడం లేదు. తాజాగా ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. స్థానికంగా ఉంటున్న ఓ వివాహితకు మొహ్సిన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సదరు వివాహిత తన భర్తతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది.

భర్త లేని సమయంలో ఆమె ప్రియుడు అక్కడికి వచ్చేవాడు. గత ఆదివారం కూడా తన ప్రియురాలి ఇంటికి మొహ్సిన్ వచ్చాడు. రహస్యంగా తన ప్రియురాలితో ఉండగా వివాహిత భర్త సడెన్ గా ఇంటికి వచ్చాడు. దీంతో అతడి నుండి తప్పించుకునే క్రమంలో అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు విడిచాడు. పరాయి వ్య‌క్తి భార్య‌ సఖం కోసం వెళ్లిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా తన భర్తకు ద్రోహం చేసిన వ్యక్తిగా భార్య దోషిలా నిలబడాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement