ప్రభన్యూస్ :దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థిసంఘం మాజీ నాయకుడు షర్జీల్ ఇమామ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. జాతి, కుల, ప్రాంత, పుట్టుక, భాష, మతపరంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, దేశ రాజధాని ఢిల్లిలో అల్లర్లకు కారకుడయ్యారన్న అభియోగాలపై గత జనవరి 25న షర్జీల్ పై కేసు నమోదుకాగా అదే నెల 28న బీహార్‌లోని జెహనాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ ప్రాంతంలో జరిగిన అల్లర్ల వెనుక షర్జీల్ హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలడంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీనిని సవాలు చేస్తూ బెయిల్ కోసం షర్జీల్ ఢిల్లి కోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వవిధానానికి తనపై పెట్టిన కేసు ఉదాహరణ అని, బెయిల్ మంజూరు చేయాలని ఈఏడాది అక్టోబర్‌లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సుదీర్ఘ విచారణ తరువాత గురువారం ఢిల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital