రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు సోమవారం నాడు 3 శాతం పడిపోయాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అంత సంతృప్తికరంగా లేకపోవడంతో షేర్లు నేలచూపు చేశాయి. కొద్ది రోజులుగా ఈ షేర్ల ధరలు తిరోగమనంలోనే సాగుతున్నాయి. ఇవ్వాళ 3 శాతం పడిపోయి ఒక్కొక్క వాటా ధర రూ.2,542కు చేరుకున్నది. ఎన్‌ఎస్‌ఈలో ఈ స్టాక్ ధర 2.99 శాతం పడిపోయి రూ.2,542.25కు చేరుకున్నది. ఏప్రిల్ 29 నుంచి ఈ స్టాక్ దాదాపు 9.82 శాతం మేర విలువను కోల్పోయింది. శుక్రవారం నాడు ముఖేశ్ అంబానీ మార్చితో ముగిసిన క్వార్టర్ లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ 22.5 శాతం లాభాలు ఆర్జించిందని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..