Saturday, November 23, 2024

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశంలో కరోనా కల్లోలంతో ఇటీవల భారీ నష్టాలను చవిచూసిన స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా రెండో రోజు లాభాలను దక్కించుకున్నాయి. ఇవాళ ఉదయం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల మేర హెచ్చుతగ్గులను ఎదుర్కొంది. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 48,804కి చేరుకుంది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకుని 14,581 వద్ద స్థిరపడింది.

భారత్‌లో కరోనా కొరతను అధిగమించేందుకు గానూ విదేశీ టీకాలకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ప్రకటించిన కేంద్రం నిర్ణయంతో గత సెషన్‌లో జోరుగా సాగిన సూచీలు.. నేడు కూడా అదే ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. 48,512 పాయింట్లతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌.. ఆరంభంలో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఒక దశలో 48,010.55 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే లోహ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో మళ్లీ పుంజుకున్న సూచీ  48,887 పాయింట్ల  గరిష్ఠాన్ని తాకింది. చివరకు 259.62 పాయింట్ల లాభంతో 48,803.68 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 76.70 పాయింట్లు లాభపడి 14,681.50 వద్ద ముగిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement