దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. కరోనా సెకండ్ వేవ్ ఆందోళనలు కలిగిస్తున్నప్పటికి మార్కెట్లు లాభాల్లో కొనసాగుతోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లభించడంతో భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, ఐరోపా దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా వెళుతుండడంతో ఈవారం మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా మార్కెట్లు 2 శాతం లాభాలను ఆర్జించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభపడ్డాయి. .ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 1,128 పాయింట్లు లాభపడి 50,137కి పెరిగింది. నిఫ్టీ 338 పాయింట్లు ఎగబాకి 14,845కి చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement