Monday, October 21, 2024

Share Market – ఊరించి ఉసూరుమ‌నిపించిన స్టాక్ మార్కెట్ ..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ నేడు న‌ష్టాల‌ల‌తోనే ముగిసింది.. ఈ ఉదయం సెన్సెక్స్ 81,770 వద్ద ఉత్సాహంగా ప్రారంభ ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. కానీ, ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకోవడంతో పతనమవుతూ వచ్చింది ఒక దశలో 80,811 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు కాస్త కోలుకుని 73.48 పాయింట్ల స్వల్ప నష్టంతో 81,151.27 వద్ద ముగింది. అటు నిఫ్టీ కూడా 24,679.60-24,978.30 మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 72.95 పాయింట్లు కోల్పోయి 24,781.10 వద్ద స్థిరపడింది.


నిఫ్టీలో టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement