Friday, November 22, 2024

National | రాహుల్‌, ఖర్గేతో శరద్‌ పవార్‌ భేటీ.. ఇండియా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని శుక్రవారమిక్కడ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అహద్‌తో కలిసి 10 రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో కలుసుకున్నారు. నేతలంతా 30 నిముషాలకుపైగా మంతనాలు జరిపారు. భేటీని గురించి వివరిస్తూ దేశ ప్రజల గొంతును వినిపించడానికి తాము సమావేశమైనట్టు ఖర్గే తెలిపారు.

ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రజలతో ఇండియా కూటమి మమేకమవుతుందని, వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. సీనియర్‌ నేతలు ఇండియా భవిష్యత్‌ వ్యూహం గురించి మాట్లాడుకున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితిని, ఇండియా కూటమి తదుపరి సమావేశానికి సంబంధించిన ప్రణాళికలను గురించి కూడా చర్చించుకున్నారని వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement