దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని మరో ఫ్రంట్ రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశంలో మూడో కూటమి అంశాన్ని ప్రస్తావిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ లేని మూడో ఫ్రంట్ దేశంలో రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే వివిధ పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. మూడో ఫ్రంట్ అవసరం ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా అన్నారని పవార్ చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని, ఆ ఫ్రంట్ కు పవార్ నేతృత్వం వహిస్తారని ఎన్సీపీ వర్గాలు చెపుతున్నాయి. గతంలోనే కేసీఆర్ తో పాటు పలువురు నాయకులు థార్డ్ ఫ్రంట్ ఏర్పాట్లకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరీ శరద్ పవార్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్లు సమాచార వస్తోంది. మరీ దేశంలో బీజేపీ, కాంగ్రేస్ లేని కూటమికి ప్రజలు అధికారన్ని కట్టబెడుతారో లేదా అని ఇప్పటి నుంచే రాజకీయ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు.
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఖాయమా..?
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement