ఉమ్మడి మెందక్ బ్యూరో (ప్రభ న్యూస్): సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం మధ్య తరహా ప్రాజెక్ట్ మత్తడి పడుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు, సిద్దిపేట వాగు నుంచి ఇన్‌ఫ్లో పెద్ద ఎత్తున వస్తోంది. ఇవ్వాల మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాలలో దండోరా వేయిస్తున్నారు.
వాగు పరివాహక ప్రాంతం లోకి పశువులు, గొర్రెలను మేతకు పంపించవద్దని గొర్రెల కాపరులు, రైతులు అటువైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు. శనిగరం ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాలు శనిగరం, తంగల్లపల్లి, గాగిల్లపూర్, గుగ్గిల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.