Friday, November 22, 2024

భారత టెస్ట్‌ కెప్టెన్సీ రేసులో షమీ..

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఓటిమి అనంతరం కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. తాత్కాలికంగా కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియ‌మించ‌గా.. భారత్‌ను విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘఫార్మాట్‌ కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని బీసీసీఐ తర్జనభర్జనలు జరుపుతోంది. టీమిండియా రేసుగుర్రం బుమ్రా ఇటీవల కెప్టెన్సీ విషయంలో ఆసక్తి చూపగా తాజాగా భారత స్టార్‌ పేసర్‌ షమీ కూడా తన మనసులో మాట బయటపెట్టాడు. టెస్టు జట్టు పగ్గాలు తనకు అందిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు షమీ తెలిపాడు.

కాగా రోహిత్‌శర్మ వైట్‌బాల్‌ కెప్టెన్‌గా ఖరారయ్యాడు. ఈ ఏడాది వరుసగా రెండు ప్రపంచకప్‌లు జరగనున్నాయి. ఈక్రమంలో హిట్‌మ్యాన్‌ను టెస్టు కెప్టెన్‌గా కూడా నియమిస్తే అతడిపై వర్క్‌లోడ్‌ పడవచ్చని బీసీసీఐ భావిస్తుంది. ప్రధానంగా రోహిత్‌శర్మను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ యోచిస్తుందని సమాచారం. కేఎల్‌ రాహుల్‌ లేదా రోహిత్‌శర్మ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement