ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన మహిళపై దాడి చేయడం సిగ్గచేటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం ఏమీ చేయలేదు.. స్పందించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడంపై సీతారామన్ ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు.