Tuesday, November 26, 2024

యుద్ధక్షేత్రంలోకి షాలిజా.. వాయుసేనలో కంబాట్‌ యూనిట్‌లో కమాండ్‌ బాధ్యతలు

భారతవైమానిక దళం మరొక చారిత్రక నిర్ణయం తీసుకుంది. మహిళా దినోత్సవం వేళ మహిళలను యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశపెట్టింది. వైమానిక దళంలో గ్రూప్‌ కెప్టెన్‌గా ఉన్న షాలిజా ధామికి యుద్ధక్షేత్రంలో విధులు నిర్వహించే అవకాశం కల్పించింది. ఆమెకు పశ్చిమసెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్‌ కాంబాట్‌ యూనిట్‌లో బాధ్యతలు అప్పగించింది. కాగా, రణరంగంలో నేరుగా ఓ మహిళకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం భారత వైమానిక చరిత్రలో ఇదే తొలిసారి. ధామి 2003లో హెలికాప్టర్‌ పైలట్‌గా వాయుసేనలో అడుగుపెట్టారు.

ఆమెకు 2800 గంటలు హెలికాప్టర్‌ నడిపిన అనుభవం ఉంది. పశ్చిమ సెక్టార్‌లో హెలికాప్టర్‌ యూనిట్‌కు ఫ్లైట్‌ కమాండర్‌గా వ్యవహరించింది. వాయుసేనలో గ్రూప్‌ కెప్టెన్‌ అంటే ఆర్మీలో కల్నల్‌ హోదాతో సమానం. ప్రస్తుతం ఆమె ఫ్రంట్‌లైన్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల ప్రారంభంనుంచి మెడికల్‌ విభాగం వెలుపల మహిళలకు ఆర్మీ కూడా కమాండింగ్‌ బాధ్యతలు అప్పగిస్తుండటం శుభపరిణామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement