ఢాకా: బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నియమితుడయ్యాడు. వైస్ కెప్టెన్‌గా లిటన్ దాస్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇటీవల పర్యాటక శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ మొమినల్ హక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీబ్ మరోసారి బంగ్లాదేశ్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. 2019లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించినా ఆ విషయాన్ని అతడు దాచిపెట్టాడు. అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు వేటు పడింది. గతంలో షకీబ్ రెండుసార్లు బంగ్లా టెస్టు కెప్టెన్‌గా వ్యవహిరించాడు. 2009లో వెస్టిండీస్ పర్యటనలో మొర్తజా గాయపడగా.. షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీ చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..