– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలి ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా అమ్మాయిలు శభాష్ అనిపించుకుంటున్నారు. సెమీస్‌లో న్యూజీలాండ్‌ని చిత్తుచేసిన అమ్మాయిల జట్టు ఇవ్వాల ఇంగ్లండ్ తో ఫైనల్లో తలపడుతోంది. కాగా, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న షఫాలీ సేన.. ఇంగ్లండ్ బ్యాట్స్ విమెన్ని కోలుకోని దెబ్బతీసి, 17 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది. ఇక.. 68 పరుగులకే ఇంగ్లండ్ జట్టు టీమిండియా అమ్మాయిల దెబ్బకు కుప్పకూలింది.
ఇక.. సెకండ్ ఇన్సింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ షఫాలి వర్మ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉన్న అమ్మాయిలు ఇంగ్లండ్‌ని చిత్తు చేసి వరల్డ్ కప్ సొంతం చేసుకోనున్నారు. కాగా, శనివారం బర్త్ డే జరుపుకున్న టీమిండియా కెప్టెన్ షఫాలీ వర్మ.. తన పుట్టిన రోజు కానుకగా భారత్‌కి వరల్డ్ కప్ ట్రోఫీని అందించాలని సహచరులను కోరింది. భారత అమ్మాయిలు ఫైనల్ చేరగానే.. బీసీసీఐ కార్యదర్శి జై షా వారితో మాట్లాడి అభినందనలు తెలిపారు. ఫైనల్‌కు ముందు వారిలో స్ఫూర్తి నింపారు.