Saturday, November 23, 2024

టీనేజ్‌ విద్యార్థులతో మహిళా టీచర్ల లైంగిక సంబంధాలు.. కేసులు నమోదు చేసిన పోలీసులు

విద్యార్థులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణపై యుఎస్‌లో ఆరుగురు మహిళా టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారందరిపై లైంగిక దుష్ప్రవర్తన అభియోగాలు మోపారు. డాన్‌విల్లేకు చెందిన 38 ఏళ్ల ఎల్లెన్‌ షెల్‌ వేర్వేరు సందర్భాలలో 16 ఏళ్ల వయసుగల ఇద్దరు మగ విద్యార్థులతో గతేడాది జులై, ఆగష్టు నెలల్లో లైంగిక సంబంధం ఏర్పరచుకుందని తెలిపిన ప్రాసిక్యూటర్‌లు, ఆమెపై థర్డ్‌-డిగ్రీ రేప్‌ అభియోగం మోపి, గారార్డ్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో హాజరుపరచారు. ఉడ్‌లాన్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో ఆమె అసిస్టెంట్‌ టీచర్‌ ఉద్యోగంతో పాటు లాంకాస్టర్‌ ఎలిమెంటరీ స్కూల్లో కూడా పని చేస్తోందని సమాచారం. కేసు నడుస్తుండటం వలన ఆమెను పాలనాపరమైన సెలవు మీద ఉంచినట్టు పోలీసులు తెలిపారు.

అర్కాన్సాస్‌లో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అక్కడ 32 ఏళ్ల విద్యావేత్త హీథర్‌ హేర్‌ ఒక టీనేజ్‌ విద్యార్థితో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఆమె ఫస్ట్‌ డిగ్రీ నేరపూరిత లైంగిక దాడి అభియోగాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి ఆరోపణను ఎదుర్కొంటుంది ఓక్లహామాకు చెందిన 26 ఏళ్ల ఎమిలీ హాన్‌కాక్‌ అనే టీచర్‌. నాలుగు రోజుల క్రితం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో 15 ఏళ్ల విద్యార్థికి అసభ్య మెసేజ్‌లను పంపిందని పోలీసులు తెలిపారు.

అయోవాలోని లోవాలో ఉన్న డెస్‌ మోయిన్స్‌లోని క్యాథలిక్‌ హైస్కూల్లో ఆంగ్లాన్ని బోధించే 36 ఏళ్ల క్రిస్టెన్‌ గాంట్‌పై కూడా ఇలాంటి అభియోగాలున్నాయి. క్రిస్టెన్‌ పాఠశాల ఆవరణతో పాటు వెలుపల కూడా టీనేజ్‌ విద్యార్థితో ఐదు సార్లు లైంగిక కార్యకలాపాలలో పాల్గొందని పోలీసులు తెలిపారు. ఇదో కోవాకు చెందిన మరో ఘటన.. వర్జీనియాలోని జెమ్స్‌ మడిసన్‌ హైస్కూల్లో టీచర్‌ గా పని చేస్తున్న 33 ఏళ్ల అల్లిdహ్‌ ఖేరాడ్‌మండ్‌, తన విద్యార్థితో లైంగిక కార్యకలాపాలలో పాల్గొన్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠాలు బోధించాల్సిన టీచర్లు విద్యార్థులతో ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొనడంపై యుఎస్‌ మీడియాలో తీవ్రదుమారం రేపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement