ప్రస్తుతం టెన్నిస్ మహిళల విభాగంలో నెంబర్‌వన్ ర్యాంకర్ ఇగా స్వీయాటెక్ . యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌ను స్వంతం చేసుకుంది. అయితే స్వియాటెక్ టీనేజర్‌గా ఉన్న సమయంలో ప్రస్తుతం పోలాండ్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిరోస్లా స్క్రిజిప్ జిన్ స్కీ ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు పోలాండ్ పార్లమెంటేరియన్ కేథరిన్ వెల్లడించడంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఆమె వ్యాఖ్యలపై తాజాగా స్వీయటెక్ ట్విట్టర్ వేదికగా స్పందించింది.
” మహిళా టెన్నిస్ టాప్ ర్యాంకర్ ఇలాంటి విషయాలపై మౌనంగా ఉండలేను. పోలిష్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడి వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. బాధితుల గూర్చి ఆలోచించాలి. ఏం జరిగిందో అనే దానిపై ఫెడరేషన్ డైరెక్టర్లు లేదా మీడియా వెలికి తీయాలి. అయితే టీనేజిలో కెరీర్‌ను కాపాడిన నా తండ్రికి ధన్యవాదాలు. మా నాన్న వల్లే లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉండగలిగాను” అని స్వీయాటెక్ ట్వీట్ చేసింది. స్వియాటెక్ స్పందించడంపై టెన్నిస్ మాజీ దిగ్గజం మార్టినా స్పందించింది. స్వీయాటెక్ను అభినందించింది.