వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : కుటుంబంలో కలతలు.. దానికి తోడు ఒకరితో మరొకరికి మనస్పర్థలు. ఎవ్వరికీ చెప్పుకోవాలో తెలియని అయోమయం. నిత్యం జరుగుతున్న సంఘర్షణతో ఎటు తేల్చుకోలేని దైన్య స్థితి. దాంతో జీవితంపై విరక్తి పెరుగుతోంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన కలచి వేస్తోంది. దిక్కు తోచని స్థితిలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో హన్మకొండ నయీంనగర్ లో 40 ఏళ్ల వయస్సు కలిగిన వివాహిత ఒంటరిగా కలవర పడుతున్న మానిసిక వేదనతో హన్మకొండ, కరీంనగర్ ప్రధాన రహదారిపైకి నైటీలో చేరుకొంది.
ఎందుకు రోడ్డెక్కెందో, ఎక్కడికి పోవాలనే కనీస ఆలోచన లేకుండానే కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు వైపు అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకొంటూ వెళ్ళింది. ఓ గంట పాటు మానసిక సంఘర్షణకు లోనైంది. చని పోవడానికై బయటకు వచ్చిన ఆ వివాహిత మహిళకు ఇద్దరు పిల్లలు గుర్తొచ్చారు. దాంతో కొంత ఉపశమానికొచ్చిన సదరు మహిళ ఇంటికి వెళ్లాలని వెనుతిరిగింది. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో నడుచుకొంటూ వెళ్లలేక తటాపాటియిస్తున్న తరుణంలో భీమారంకు చెందిన ఆటో డ్రైవర్ సదరు వివాహిత మహిళను ట్రాప్ చేశాడు.
నయీం నగర్ వద్ద దింపుతానని నమ్మించి, మరో మిత్రుడికి ఫోన్ చేసి పీల్చుకున్నాడు. ఆవేదన, ఆక్రందనలో ఉన్న మహిళకు ఇంటికి వెళ్ళే దారి సరిగా తెలియక గుమ్మనంగా ఉండటాన్ని అవకాశంగా తీసుకుని భీమారం చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడికి పాల్పడ్డారు. అర్థరాత్రి ఒంటి గంట కావడమే కాక నిర్మానుష్య ప్రాంతంలో జన సంచారం లేక పోవడంతో ఆ మహిళ ఆర్తనాదాలు ఎవ్వరికీ వినపడలేదు. ఆటో డ్రైవర్ల దారుణానికి ఆ మహిళ లైంగిక దాడికి గురైంది. శనివారం సదరు వివాహిత మహిళ హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హన్మకొండ ఇన్స్ పెక్టర్ సి హెచ్ శ్రీనివాస్ జీ తెలిపారు.
అదుపులో నిందితులు..
లైంగికదాడి ఫిర్యాదును అందుకొన్న హన్మకొండ పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ శ్రీనివాస్ జీ ఆదేశాల మేరకు సీసి టివి పుటేజీ ఆధారంగా ఆటో నంబర్ ను గుర్తించారు. ఆటో నంబర్ మేరకు ఆటో డ్రైవర్ ను, లైంగికదాడికి పాల్పడ్డ మరోకడిని గుర్తించారు. వారిద్దరినీ హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివాహిత మహిళపై లైంగిక దాడికి తెగబడటాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వారిపై రౌడీషీటర్ తెరవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అలాగే నగరంలో ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.