మేడిపల్లి, (ప్రభన్యూస్): మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకనగర్ కు చెందిన భార్య భర్తలు బోడుప్పల్ 10వ డివిజన్ మల్లికార్జున నగర్ రోడ్ నంబర్ 4లో నిర్మాణంలో ఉన్నఇంటికి వాచ్ మాన్ గా పనిచేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు వారి బిడ్డ కనబడక పోవడంతో అన్ని ప్రాంతాల్లో వెతికారు.
చివరకు అక్కడే ఉన్న పవర్ మజిల్ జిమ్ లో చూడగా బాలిక అక్కడే ఉండడం, ఆ బాలికను తల్లి విచారించగా జిమ్ లో పనిచేసే ఉపేందర్ (30) తనపై లైంగిక దాడి చేశాడని చెప్పడంతో స్థానికులతో కలిసి అతనిని నీలదీసింది.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో నిందితుడు ఉపేందర్ ను స్టేషన్ కు తరలించారు. దీనిపై ఎంక్వైరీ జరిపి వివరాలు తెలుసుకుంటామన్నారు. కేసు నమోదు చేసింది లేనిది ఇంకా తెలియరాలేదు.