Tuesday, November 26, 2024

‘Sexist’: పాటియాల హౌస్​ కోర్టు ప్రాంగణంలో అసభ్యకర డ్యాన్స్​లు.. అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాదులు (వీడియో)

హోలీ పండుగ సందర్భంగా న్యూ ఢిల్లీ బార్ అసోసియేషన్ పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన ఓ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ప్రోగ్రామ్​లో పొట్టి పొట్టి బట్టలు ధరించిన మహిళా నృత్యకారులు వేదికపై ప్రదర్శన చేశారు. ఈ ఈవెంట్‌ను ‘‘షాకింగ్”అని పేర్కొంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆఫీస్ బేరర్‌లపై న్యాయవాదుల బృందం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మార్చి 6న జరిగిన ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతతం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. స్టేజిపై రెడ్​ కలర్​ డ్రెస్​ ధరించిన ఓ  మహిళ హిందీ సినిమా పాటకు డ్యాన్స్​ చేస్తూ కనిపిస్తోంది.

అయితే.. బార్​ అసోసియేషన్​పై లేఖాస్త్రం సంధించిన న్యాయవాదుల బృందం.. ఈ లేఖ నృత్యకారులకు వ్యతిరేకంగా కాదని, వారిని అగౌరవపరిచే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. అయితే.. ఈ తరహా ఈవెంట్‌ని ఓ బార్‌ అసోసియేషన్‌ నిర్వహించడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. ఈ వేడుకను పాటియాలా హౌస్ కోర్టుల ప్రాంగణంలో నిర్వహించడం మరింత భయంకరంగా ఉందని కార్యక్రమాన్ని వ్యతిరేకించిన న్యాయవాదుల బృందం పేర్కొంది.

https://twitter.com/HateDetectors/status/1634843115923308546

Advertisement

తాజా వార్తలు

Advertisement