Sunday, November 24, 2024

Sex Scandal – జేడీయూ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్

బెంగళూరు – సెక్స్ కుంభకోణం కేసులు కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి జేడీయూ నేత, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసు నమోదైంది. తాజాగా కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను దేవెగౌడ నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు అతని అరెస్ట్‌కు వ్యతిరేఖంగా రక్షణ కల్పించాలనే పిటిషన్‌ని తిరస్కరించిన తర్వాత అరెస్ట్ జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో ఏర్పాటు చేసిన సిట్ రేవణ్ణను అరెస్ట్ చేసింది.

తన తల్లిని రేవణ్ణ, అతని సహాయకుడు కిడ్నాప్ చేశారని 20 ఏళ్ల యువకుడు ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రాజు ఫిర్యాదు మేరకు రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు. కిడ్నాప్‌ కేసులో రేవణ్ణ బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

సదరు మహిళ 5 ఏళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేసి, మూడేళ్ల క్రితం అక్కడ పని మానేసింది. ఏప్రిల్ 26న సతీష్ ఆమెను రేవణ్ణ పిలుస్తున్నాడని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదే రోజు ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ ఏప్రిల్ 29న ఆమెను మళ్లీ తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధిత మహిళ కుమారుడు తన తల్లి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement