Friday, November 22, 2024

ఉత్తర భారతంలో భారీగా పెరుగుతున్న చలి.. తీవ్రంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఉత్తర భారతంలో చలిగాలులు భారీగా వీస్తున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పలు చోట్ల మైనస్‌ 2 నుంచి 4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనవరి 14 నుంచి 19 వరకు ఉష్ణోగ్రతలు మరింగా పడిపోయేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి టిట్టర్‌లో తెలిపారు. 16-18 మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైయే సూచనలున్నాయని అధికారి తెలియజేశారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్‌ 6 డిగ్రీలకు పడిపోయాయి. పంజాబ్‌, హర్యానా, న్యూఢిల్లిd, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తర మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పలుచోట్ల సున్నా నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement