హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటు-ందని స్పష్టం చేసింది. రెండ్రోజులుగా కిందిస్థాయి నుంచి తూర్పుదిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని తెలిపింది. ఆ తరువాత రాష్ట్రంలో చలి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
డిసెంబరు ఆఖరి వారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో పాటు ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య అత్యల్పంగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే సూచనలున్నాయని పేర్కొంది. ఆకాశం నిర్మలంగా ఉంటు-ందని విెవరించింది. వారం రోజుల పాటు తుఫానులు ఏర్పడే పరిస్థితులు లేవని తెలిపింది. డిసెంబర్ 19 వరకు తెలంగాణతోపాటు- ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. ప్రస్తుతం మాల్దీవుల వద్ద ఉపరితల ఆవర్తనం ఉందని, దాంతో తెలుగు రాష్ట్రాల్రపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.