Friday, November 22, 2024

Delhi : ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం

దేశ రాజధాని దిల్లీలో వాయునాణ్యత రోజురోజుకు భారీగా క్షీణిస్తోంది. చాలా ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు అలుముకోవడంతో రోడ్లు, భవనాలు కంటికి కనిపించకుండా పోయాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో వాయునాణ్యత సూచీ 400 దాటి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి.

ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో యాంటి- స్మోగ్‌ గన్‌లతో అధికారులు నీటి తుంపరను చల్లి.. పొగ మంచును తగ్గించే చర్యలు చేపట్టారు. మరోవైపు వాయు నాణ్యత క్షీణించడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement