Friday, November 22, 2024

Save Tigers | మధ్యప్రదేశ్‌లో ఏడో పులుల ప్రాజెక్టు.. త్వరలోనే ప్రకటించే చాన్స్​

మధ్యప్రదేశ్‌లో ఏడో పులుల ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీ పర్మిషన్​ ఇచ్చింది. దేశంలో 54వ టైగర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఈ టైగర్ ప్రాజెక్ట్‌కు విరంగన దుర్గావతి అని పేరు పెట్టనున్నారు. దీని వైశాల్యం మధ్యప్రదేశ్‌లోని దామో, సాగర్ జిల్లాల మధ్య 2 వేల 339 చదరపు కిలోమీటర్లు ఉండబోతోంది. మధ్యప్రదేశ్‌లోని ఆరు టైగర్ ప్రాజెక్ట్‌లతో పోల్చితే, ఇది అతిపెద్ద టైగర్ ప్రాజెక్ట్ గా అధికారులు చెబుతున్నారు. కోర్ ఏరియా 1,414 చదరపు కిలోమీటర్లు, బఫర్ ఏరియా 925.12 చదరపు కిలోమీటర్లు ఉండనుంది.

కాగా, మధ్యప్రదేశ్‌లోని నౌరదేహి, వీరాంగన దుర్గావతి అభయారణ్యాలను కలుపుతూ ఈ ఏడో టైగర్ ప్రాజెక్ట్‌కు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి ఇచ్చింది. గతంలో వన్యప్రాణి బోర్డుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్ అటవీశాఖ ఈ టైగర్ ప్రాజెక్ట్ నోటిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ప్రపంచ పులుల దినోత్సవానికి ముందు అంటే.. జులై 29వ తేదీన దీన్ని అధికారికంగా ప్రకటించే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement