విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : విశాఖపట్నం వేదికగా శుక్రవారం జరిగిన డీప్ టెక్ సదస్సులో జిఎఫ్‌ఎస్‌టి (గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్)కి వివిధ కంపెనీలకు మధ్య ఏడు ఒప్పందాలు జరిగాయి.
విద్య, వైద్య రంగాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ స్టడీస్, మహిళా సాధికారత తదితర అంశాలపై జిఎఫ్‌ఎస్‌టితో సమగ్ర, జీఎస్సార్, ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్, జర్మన్ వర్శిటీ ఒప్పందాలు చేసుకోగా, గేమ్ కంపెనీ రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఎస్ కంపెనీతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయా కంపెనీల ప్రతినిధులు ఎంఓయూలకు సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు.