Thursday, November 21, 2024

ఐసిసి టి20 టీమ్స్ లో మ‌న అబ్బాయిలు ముగ్గురు, అమ్మాయిలు న‌లుగురు…

ముంబై . ఐసిసి టి 20 పురుషుల‌, మ‌హిళ‌ల జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది.. పురుషుల జ‌ట్టులో ముగ్గురు, మ‌హిళ‌ల జ‌ట్టులో న‌లుగురు మ‌న దేశం నుంచి ఎంపిక‌య్యారు. భార‌త జ‌ట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఈ టీమ్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌ను కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌గా ఎంపిక చేసింది. జ‌ట్టులో ఇంగ్లండ్ టీమ్ నుంచి జోస్ బ‌ట్ల‌ర్, ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, పాక్ నుంచి రిజ్వాన్, హ్యారిస్ రౌఫ్‌ల‌ను సెల‌క్ట్ చేసింది. ఈ లిస్టులో స్పిన్న‌ర్ హ‌స‌రంగ (శ్రీ‌లంక‌), సికింద‌ర్ ర‌జా (జింబాబ్వే), జోష్ లిటిల్ (ఐర్లాండ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఈ టీమ్‌కు జోస్ బ‌ట్ల‌ర్‌ను కెప్టెన్‌, వికెట్ కీప‌ర్‌గా ఎంపిక చేసింది. రిజ్వాన్, బ‌ట్ల‌ర్‌ల‌ను ఓపెనింగ్ జోడీగా ప్ర‌క‌టించింది.
జ‌ట్టు ఇదే.. జోస్ బ‌ట్ల‌ర్ (కెప్టెన్, వికెట్ కీప‌ర్), మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, గ్లెన్ ఫిలిప్స్, సికింద‌ర్ ర‌జా, హార్ధిక్ పాండ్యా, సామ్ క‌ర‌న్, వ‌నిందు హ‌స‌రంగ‌, హ్యారిస్ రౌఫ్‌, జోష్ లిటిల్.

ఇక మ‌హిళ‌ల టి20 జ‌ట్టులో స్మృతి మంద‌న‌, రిచా ఘోష్, దీప్తి శ‌ర్మ‌, రేణుకా సింగ్ ఠాకూర్ లు ఎంపిక‌య్యారు.. ఆస్ట్రేలియా నుంచి త‌హ్లియా మెక్‌గ్రాత్, అష్ గార్డ్‌న‌ర్, బేథ్ మూనేలు సెల‌క్ట్ అయ్యారు. నిడా దార్ (పాకిస్థాన్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇనోక ర‌ణ‌వీర (శ్రీ‌లంక‌) కూడా ఈ జ‌ట్టులో చోటు సంపాదించారు. ఈ టీమ్‌కు న్యూజిలాండ్ ప్లేయ‌ర్ సోఫీ డెవినేను కెప్టెన్‌గా, రీచా ఘోష్‌ను వికెట్ కీప‌ర్‌గా ఎంపికైంది.
జ‌ట్టు ఇదే.. సోఫీ డెవినే (కెప్టెన్), స్మృతి మంధానా, బెథె మూనే, అష్ గార్డ్‌న‌ర్, త‌హ్లియా మెక్‌గ్రాత్, నిడా దార్, రీచా ఘోష్‌ (వికెట్ కీప‌ర్‌), సోఫీ ఎక్లెస్టోన్‌, ఇనోక ర‌ణ‌వీర‌, రేణుకా సింగ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement