Wednesday, November 20, 2024

నాగ్‌పూర్‌లో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్

మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నాగ్‌పూర్‌ జిల్లాలో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. మార్చి 15 నుంచి 21 వరకు అత్యవసర సేవలు మినహా పూర్తిస్థాయి లాక్‌డౌన్ నిర్వహిస్తామని మంత్రి నితిన్ రౌత్ వెల్లడించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల బూత్‌ల వంటి వాటికి లాక్‌డౌన్ నుండి మినహాయించారు. కాగా దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్టాలలో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,710 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 173 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement