Friday, November 8, 2024

ఏపీ స‌భ‌లో ఏడు బిల్లులు- సంధ్య మృతిని రాజ‌కీయం చేయ‌డం దారుణం-మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని

ఏడు బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది ఏపీ స‌ర్కార్. నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.
విద్య, వైద్యం, నాడు-నేడుపై నేడు స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక కూడా రానుంది.
వైద్యానికి సంబంధించిన విషయంపై మంత్రి విడదల రజని మాట్లాడుతూ… విష జ్వరాల కట్టడికి పటిష్ఠ చర్యలను తీసుకున్నామని చెప్పారు. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెప్పారు. మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులను దుర్వినియోగం చేసిందని రజని విమర్శించారు. వైరల్ డిసీజ్ తో చిన్నారి సంధ్య మృతి చెందడం బాధాకరమని… ఈ అంశాన్ని టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం దారుణమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement