Friday, November 22, 2024

ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు ఏడు అవార్డులు.. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు మొదటి బహుమతి

ఇంధన సామర్ధ్యంలో ప్రతి ఏడాది ఇచ్చే అవార్డుల్లో భాగంగా 2022 ఏడాదికి గాను ప్రకటించిన అవార్డుల్లో దక్షిణ మధ్య రైల్వేకు ఏడు అవార్డులు లభించాయి. రైల్వే స్టేషన్ల విభాగంలో మొదటి, రెండు స్థానాలు దక్షిణ మధ్య రైల్వేకే దక్కాయి. మొదటి స్థానంలో హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నిలువగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్‌ రైల్వే స్టేషన్‌ నిలిచింది. మరో మూడు రైల్వే స్టేషన్లకు సర్టిఫికేట్‌ ఆఫ్‌ మెరిట్‌ లభించింది.

అవి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, తెనాలి రైల్వే స్టేషన్లు. గవర్నమెంట్‌ బిల్డింగ్‌ విభాగంలో గుంతకల్‌ రైల్వే హాస్పిటల్‌, ఎలక్ట్రిక్‌ ట్రాక్సిన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ విజయవాడ అవార్డులు పొందాయి. కేంద్ర ఇంధన శాఖ ప్రకటించిన ఈ అవార్డులను డిసెంబర్‌ 14వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement