హైదరాబాద్ లో నీటి సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ వేసవిలో నీటి సమస్య ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంమంలో ప్రజలు నీటి కొరత ఏర్పడితే 155313కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. గతంలో హైదరాబాద్కు 2300 ఎంఎల్డీల నీటిని సరఫరా ఉండేదని, ప్రస్తుతం 2450 ఎంఎల్డీల నీటిని అందిస్తున్నామన్నారు. 700 ట్యాంకర్ల ద్వారా సిటీలో నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు.
నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరులో నీటి నిల్వలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నామని పొన్నం తెలిపారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడినా టోల్ ఫ్రీ నంబర్ 155313కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.