జైపూర్ లో ఓ కళాశాలలో విద్యార్థులు ఏటీఎం జిమ్ ఏర్పాటు చేయాలని ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఏటీఎం, ఓపెన్ ఎయిన్ జిమ్‌తో పాటు పలు వస్తువులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మహారాణి కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు ఓవర్ హెడ్ ట్యాంకు ఎక్కారు. తమకు ఏటీఎంతో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా.. డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాలికలు దిగివచ్చినట్లు పోలీసులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) యోగేష్ గోయల్ మాట్లాడుతూ ముగ్గురు బాలికలు పలు డిమాండ్లతో ట్యాంక్ పైకి ఎక్కారని తెలిపారు. వారు దిగేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులను పిలిపించి ఒప్పించే ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘాల ఎన్నికలకు ముందు.. కళాశాల ఆవరణలో ఏటీఎం మిషన్లు, బ్యాంకులు, ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కళాశాలలో జిమ్ ఏర్పాటు… సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినుల నిరసన
Advertisement
తాజా వార్తలు
Advertisement