రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ కాలికి గాయం కారణంగా మరి కొన్ని రోజుల్లో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కి దూరమయ్యే అవకాశం ఉంది. RCB తరుఫున గత సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 29 ఏళ్ల పాటిదార్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చికిత్స పొందుతున్నాడు. తిరిగా టీమ్ లో చేరడానికి పాటిదార్‌కు NCA మెడికల్ క్లియరెన్స్ అవసరం. ఇక అతను పోటీల్లో పాల్గొనాలా లేదా అని నిర్ణయించే MRI స్కాన్ వచ్చే వరకు విశ్రాంతి తీసుకోవాలని NCA సూచించింది.
అంతే కాకుండా, ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ టోర్నమెంట్‌లో పాల్గొనడంపై కూడా తీవ్రమైన సందేహాలు కనిపిస్తున్నాయి. అకిలెస్ స్నాయువు గాయానికి సంభందించి చికిత్స పొందుతున్నాడు హేజిల్‌వుడ్ . ఐపిఎల్ ప్రారంభం కావడానికి వారం కంటే తక్కువ పమయం ఉండగా.. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబి జట్టు మరిన్ని కష్టాలను ఎదుర్కోంటుంది.