బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సర్వోమ్యాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అవసరాల వెంకటేశ్వర రావును ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ వివిధ బ్యాంకుల నుంచి రూ.402 కోట్ల రుణం తీసుకున్నట్లు గుర్తించింది. అంతేకాదు చంద్రశేఖర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. సర్వోమ్యాక్స్‌పై 2018లో సీబీఐ కేసు నమోదు కాగా, తీసుకున్న రుణాన్ని ఇతరత్రా అవసరాలకు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. అవసరాల వెంకటేశ్వరరావుపై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగించిన ఈడీ అధికారులు ఎండీ అవసరాల వెంకటేశ్వర రావును అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..